భయపడుతున్న ఆసీస్ క్రికెటర్లు..ఉగ్రదాడే కారణం!

Frightened Aussie cricketers

0
35

పాకిస్థాన్‌లో ఆస్ట్రేలియా జట్టు పర్యటనకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఇరుదేశాల బోర్డుల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆస్ట్రేలియా సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ చెప్పారు. కానీ ఈ పర్యటనకు వెళ్ళడానికి  పలువురు ఆటగాళ్లు మాత్రం పాక్ వెళ్లేందుకు భయపడుతున్నారట.

“పర్యటనకు సంబంధించి కొన్ని విషయాలపై రెండు బోర్డులు చర్చిస్తున్నాయి. పర్యటనకు ఆమోదం లభించగానే జట్టును ప్రకటిస్తాం. చర్చలు సరైన దిశలో సాగుతున్నాయి.” అని ఆస్ట్రేలియా సెలెక్టర్‌ జార్జ్‌ బెయిలీ చెప్పారు. అయితే కొంతమంది ఆసీస్​ ఆటగాళ్లు ఈ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. అంతుకముందు అక్కడ పర్యటించిన లంక జట్టు బస్సుపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే భద్రత కారణాల వల్ల ప్లేయర్స్​ అక్కడ పర్యటించేందుకు భయపడుతున్నారని క్రికెట్​ వర్గాల సమాచారం.

2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌ ఆతిథ్యానికి పాక్‌ దూరమైంది. నిరుడు టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌ చివరి నిమిషంలో తప్పుకోగా.. భద్రత కారణాలతో పాక్‌ పర్యటనకు ఇంగ్లాండ్‌ దూరంగా ఉంది. అయితే 24 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్‌లో పర్యటించేందుకు ఆసీస్‌ సన్నాహాలు చేసుకుంటుంది.