Flash: ఏకగ్రీవ గ్రామ పంచాయితీలకు సీఎం కేసీఆర్ షాక్

cm-kcr-shock-to-unanimous-gram-panchayats

0
51

ఏకగ్రీవ గ్రామ పంచాయితీలకు సీఎం కేసీఆర్ షాక్ ఇచ్చారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో గ్రామ పంచాయతీలు దివాళా తీశాయని ఆరోపించారు. ఒక వ్యక్తిపై సగటున రూ.650 ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పదేళ్లలో వ్యక్తిపై సగటున రూ.4 మాత్రమే ఖర్చు చేశారని స్పష్టం చేశారు.

ఏకగ్రీవమైన గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పలేదని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క శాసనసభలో లేవనెత్తిన అంశంపై కేసీఆర్​ వివరణ ఇచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

పంగత ప్రభుత్వాల హయాంలో సర్పంచులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. రాష్ట్రంలో సర్పంచులు గౌరవంగా బతుకుతున్నారని చెప్పారు. మన గ్రామాలను చూసి పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయన్న కేసీఆర్​.. కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు.

ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే కేంద్రం నిధులు విడుదల చేస్తోందని ప్రకటించారు. కొన్నిచోట్ల వనరులు ఉంటాయి.. మరికొన్నిచోట్ల వనరులు ఉండవని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ఆదాయం సమకూరుతుందని ఉద్ఘాటించారు. అన్ని పంచాయతీలకు సమన్యాయం జరగాలని ఆలోచిస్తున్నామన్నారు.