తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోె భేటీ కానున్నారు. ముంబై వచ్చి తమ ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా ఆహ్వానించారు. లంచ్ మీటింగ్ లో ఇరు నేతలు కలుసుకోనున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం, బీజేపీకీ వ్యతిరేఖంగా కేసీఆర్ గళమెత్తారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. కేసీఆర్ పోరాటానికి మద్దతు ప్రకటించారు. సీఎం ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో ముంబయికి బయల్దేరి వెళ్తారు.
ఆయన వెంట ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు తదితరులు ఉంటారు. ఇప్పటికే.. కేసీఆర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవగౌడ సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ కు మద్దతు కూడా ప్రకటించారు. త్వరలోనే ఎన్డీయేతర సీఎంలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు.