సీఎం కేజ్రీవాల్ మాట‌కు అంద‌రూ షాక్ అంత‌మందికి సోకింద‌ట

సీఎం కేజ్రీవాల్ మాట‌కు అంద‌రూ షాక్ అంత‌మందికి సోకింద‌ట

0
95

ఢిల్లీలోని మర్కజ్ మసీదు లో కార్య‌క్ర‌మానికి ప్రార్ధ‌న‌కు వెళ్లి వ‌చ్చిన వారికి చాలా వ‌ర‌కూ క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి, ఇప్పుడు ఇదే పెద్ద టెన్ష‌న్ లో ప‌డేసింది, ఇది అన్నీ రాష్ట్రాల‌లో ఎఫెక్ట్ చూపిస్తోంది, తెలంగాణ ఏపీ త‌మిళ‌నాడు క‌ర్నాట‌క‌లో కూడా ఇలా మ‌సీదుకు వెళ్లి అక్క‌డ నుంచి వ‌చ్చిన వారిలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి.

ఢిల్లీలోని మర్కజ్ మసీదు నుంచి బయటకు తీసుకొచ్చిన వారిలో 441 మందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని సీఎం కేజ్రీవాల్ అన్నారు. మర్కజ్ భవన్ లో ఉండొచ్చిన 1500 మంది తబ్లీక్ జమాత్ గ్రూప్ కార్యకర్తలను క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. దీంతో అంతా షాక్ అయ్యారు.

నేటి వ‌ర‌కూ ఢిల్లీలో 97 కరోనా కేసులు నమోదయ్యాయని, అందులో 24 మంది మర్కజ్ మసీదు నుంచి వచ్చిన వారేనని అన్నారు. ఈ స‌మయంలో క‌చ్చితంగా ప్ర‌భుత్వం చెబుతున్న విధంగా ఉండాల‌ని అన్నీ ఆంక్ష‌లు నియ‌మాలు పాటించాలి అని తెలిపారు ఆయ‌న‌.