ఏపీలో సంచలనానికి తెరతీసిన సీఎం రమేష్

ఏపీలో సంచలనానికి తెరతీసిన సీఎం రమేష్

0
105

సీఎ రమేష్ ఈపేరు గత టీడీపీ ప్రభుత్వంలో మారు మ్రోగిన పేరు… చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటుగా ఉన్న సీఎం రమేష్ ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రతిపక్షంలో చేరడంతో ఆయన గత రెండునెలల క్రితం బీజేపీలో చేరారు.. బీపీలో చేరిన తర్వాత తొలిసారి రమేష్ మీడియా ముందు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

రానున్న రోజుకల్లో భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఉండవని అన్నారు. అందుకే తాను బీజేపీలో చేరడానికి కారణం అని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయని అన్నారు. ఇందుకు అన్నిపార్టీల మద్దతును కూడగట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

కాగా ఇక నుంచి బీజేపీ తరపున ఏపీలోప్రత్యక్ష రాజకీయాలు చేసేందు ఆయన రెడీ అయ్యారు. బీజేపీలో రమేష్ మీడియాముందు కనబడనప్పటికీ తెరవెనుక రాజకీయాలను చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు మరింత యాక్టివ్ గా వ్యవహరించి బిల్లులను పాస్ చేసే విషయంలో మెజార్టీ సభ్యులను కూడగట్టుకున్నారు.