సీఎం తెలంగాణలో ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించాలి..రేవంత్ రెడ్డి

0
105
revanth reddy

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తెలంగాణాలో ఉన్న సంక్షోభాలను వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు. మన రాష్ట్రంలో ప్రతి రోజు తెలుగు అకాడమీ లోపల వేల మంది ఉద్యోగార్థులు లైన్ లో నిలబడుతున్నారు. ఈ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులకు ప్రాథమిక పుస్తకాలను అందజేయాలని కోరారు.

అంతేకాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో ఆంగ్ల భాష కారణంగా తెలుగు మీడియం స్టడీ మెటీరియల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. దీనిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారించాలని తేలియజేసాడు. ఇంకా రాష్ట్రంలో ఉద్యోగాలకై నిరుద్యోగులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కావున రాష్ట్రంలో ఉద్యోగాల జాతర మొదలుపెట్టి వారిని ముందుకు నడిపించాలని కోరుకున్నారు. ఈ సంక్షోభాన్ని సీఎం కేసీఆర్ తీర్చాలని రేవంత్ రెడ్డి తెలియజేసారు.