సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఈ విషయాలు మీకు తెలుసా

సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఈ విషయాలు మీకు తెలుసా

0
98

వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి.. ఆయన 1972 డిసెంబరు 21 న జమ్మలమడుగు గ్రామంలో జన్మించారు. చదువు పూర్తి అయిన తర్వాత విద్యుత్ ప్రాజెక్టులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వై.యస్. జగన్ ను ఆయన తండ్రి దివంగత సీఎం వైయస్సార్ రాజకీయాల్లోకి తీసుకువచ్చారు.

2009 మేలో తొలిసారిగా కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. తన తండ్రి వై.యస్. రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 9 న ఆకస్మిక మరణవార్త విని చనిపోయిన వారి కుటుంబాలను కలుసుకోవడానికి ఓదార్పుయాత్ర చేపట్టారు. కాని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దానికి నిరాకరించారు.

దీంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో విభేదించి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. 2011 మార్చి 11 న వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. ఆయన తల్లి, వై.యస్.విజయమ్మ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. తర్వాత రాజీనామాతో 2011 మేలో జరిగిన ఉపఎన్నికలలో కడప లోకసభ సభ్యునిగా 5.45 లక్షల ఆధిక్యతతో దేశంలో రికార్డు నెలకొల్పి గెలుపొందారు

2012 మే 25న అక్రమాస్తుల అభియోగంతో అరెస్ట్ అయ్యారు… 16 నెలల పాటు జగన్ చంచల్ గూడ జైలులో ఉన్నారు… 2013 సెప్టెంబరు 23 న నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చేతిలో అతిస్వల్ప ఓట్ల శాతం 1.25 తో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.. ఐదేళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించారు, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంతో పోరాడి, ప్రజలలో ప్రత్యేకహోదాపై అవగాహన కల్పిస్తు వచ్చారు ప్రజాసంకల్పయాత్ర పేరుతో ఇడుపులపాయలో 2017 నవంబరు 16 న ప్రారంభించి 2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించారు.

14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రజలకు దగ్గర అయ్యారు వైయస్ జగన్, 2019 ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో 175 శాసన సభ స్థానాలకుగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలు రికార్డు స్థాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రిగా మరింత దగ్గర అవుతున్నారు.