సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఇదే…

సీఎం జగన్ టూర్ షెడ్యూల్ ఇదే...

0
34

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు… నవర్నాల్లో పొందుపరిచిన అంశాలను అమలు చేస్తున్నారు… ఇప్పటికే కొన్ని పథకాలను ఆయా జిల్లాల్లో ప్రారంభించిన జగన్ తాజాగా మరో పథకాన్ని విజయనగరం జిల్లాలో ప్రారంభించనున్నారు…

ఈ నెల 24న విజయనగరం జిల్లాలో జగనన్న వసతిదీవెన పథన్ని ప్రారంభించనున్నారు… ఆ రోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖకు చేరుకుని అక్కడ నుంచి హెలిక్యాప్టర్ ద్వారా విజయనగరానికి చేరుకుంటారు… అక్కడ జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభిస్తారు…

ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తున్నారు అలాగే మహిళలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ ను జగన్ ప్రారంభిస్తారు… సీఎం హోదాలో జగన్ తొలిసారి జిల్లాకు వస్తుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ప్రజా ప్రతి నిధులు సిద్దమవుతున్నారు…