దమ్ముంటే అక్కడికి రా..రాజగోపాల్ రెడ్డికి రేవంత్ సంచలన సవాల్

0
111

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రస్తుత పరిస్థితి ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడినప్పటి నుండి పొలిటికల్ హీట్ మరింత రాజుకుంటోంది. ఇక రాజగోపాల్ పోతూ పోతూ రాజీనామాకు కారణాలను వివరించారు. అందులో రేవంత్ ప్రస్తావన ఇప్పుడు ఇద్దరి మధ్య మాటల తూటాలకు కారణం అయింది.

ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా, ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అనేక సేవలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వల్లే బ్రాండ్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి విసిరిన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. ఈరోజు (శుక్రవారం) నేను చండూరుకు వస్తున్నా. చండూరు చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా. గత ఎనిమిదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడలేదు. నేను పోరాడితే నాపై 80 కి పైగా కేసులు పెట్టారు. ఆర్థిక ప్రయోజనాల కోసం పార్టీ మారావు. నన్ను తిట్టి, రాజకీయ లబ్ధి పొందాలని చూడవద్దు. రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వేర్వేరు వ్యక్తులు అన్న ఆయన.. తమ మధ్య కొందరు అగాధం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు.