కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పనిలేదు కొత్త విధానం తెలుసుకోండి

కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సిన పనిలేదు కొత్త విధానం తెలుసుకోండి

0
32

ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే పోలీస్ స్టేషన్ కు వెళ్లి పూర్తి వివరాలు ఇవ్వాలి ఇప్పటి వరకూ, అయితే ఇప్పుడు కొత్త విధానం అమలులోకి వచ్చింది. తమ ప్రాంతానికి వచ్చే పెట్రోకార్ పెట్రోలింగ్ మొబైల్ సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే సరిపోతుంది. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ జారీ చేస్తారు. అవును హైదరాబాద్ లో తాజాగా ఈ కొత్త విధానం అమలులోకి తీసుకువచ్చారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానాన్ని హైదరాబాద్ నగరంలో అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అన్ని జోన్ల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సిన పనిలేదు, అక్కడ రైటర్ లేదా హౌస్ ఆఫీసర్ ఉంటేనే కంప్లైంట్ తీసుకుంటారు ఇక వారు లేకపోయినా కంప్లైంట్ ఇచ్చేయచ్చు

మళ్లీమళ్లీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగక్కర్లేదు. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులకు బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్రోకార్ అధికారులను ప్రకటించాం. ఎక్కడ ఏ నేరం జరిగినా.. ముందు చేరుకునేది పెట్రోకార్, బ్లూకోల్ట్స్ సిబ్బంది మాత్రమే. వారి వల్లే విజిబుల్ పోలీసింగ్ పెరుగుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ విస్తృతమవుతోంది అని చెప్పారు, ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలి అని తెలిపారు ఆయన.

ఈ విధానం కోసం గత నెలంతా కసరత్తు చేశారు పోలీసులు… ప్రతి అధికారికి.. పెట్రోలింగ్ సిబ్బందికి దీనిపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. కొన్ని చోట్ల ట్రయల్స్ చేశారు సక్సెస్ అవడంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లోనే త్వరలో తెలంగాణ అంతా అమలు చేయనున్నారు ఈ విధానం.