‘తెరాసలో కలకలం..బీజేపీతో టచ్ లో 12 మంది ఎమ్మెల్యేలు’

0
102

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. భువనగిరి పట్టణంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన బండి సంజయ్ తెరాస నాయకులే ఉప ఎన్నికలకు కారణం కాబోతున్నారని తెలిపారు.  తమతో 10, 12 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ టిఆఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.

తెలంగాణలో ఇప్పటి వరకు నాలుగు ఉప ఎన్నికల్లో రెండు గెలిచామని బండి సంజయ్ గుర్తు చేశారు. మునుగోడు ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఎన్నికలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇంకా చాలా ప్రాంతాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బండి పేర్కొన్నారు.

మరోవైపు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజూ కొనసాగుతోంది. గొల్లగూడెం, ముగ్దుమ్‌పల్లి, గుర్రాలదండి, బట్టుగూడెం గ్రామాల మీదుగా 11.7 కి.మీ.మేర నేడు పాదయాత్ర సాగనుంది.