భయం..భయం ఒక్కరోజే ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే?

0
44
RT-PCR mandatory

ఇండియాలో కరోనా మహమ్మారి ఎంతటి కల్లోలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మహమ్మారి కొత్త వేరియంట్లుగా పుట్టుకొచ్చి పెను నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికి మూడు వేవ్ లుగా వచ్చిన ఈ మహమ్మారి ఎందరినో పొట్టనబెట్టుకుంది. ఇక తాజాగా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది.

ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో19,893 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.  24 గంటల వ్యవధిలో కొవిడ్​ నుంచి 20,419 మంది కోలుకున్నారు.

రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.

మొత్తం కేసులు : 4,40,19,811

మొత్తం మరణాలు: 5,26,530

యాక్టివ్​ కేసులు: 1,36,478

కోలుకున్నవారి సంఖ్య: 4,34,24,029