జనసేన లో కి పెరుగుతున్న వలసలు

జనసేన లో కి పెరుగుతున్న వలసలు

0
254

2019 ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక పార్టీ నుండి మరొక పార్టీ లో జంపింగ్ చేస్తున్నారు కొందరు రాజకీయ నాయకులు.తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలో చేరుతున్నారు. రాజోలు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి లు జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలవడంతో వారు ఈ పార్టీలోకి వస్తున్నారన్న వార్తలు వచ్చాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని అనుకున్నా,టిక్కెట్ హామీ రాకపోవడంతో వీరు జనసేన వైపు చూస్తున్నారని చెబుతున్నారు.