కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ బంపర్ ఆఫర్

0
86

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు కూడా జగన్ ఇచ్చిన అన్నీ హామీలు నెరవేరుస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీ ప్రజలకు మేలు చేసే విధంగానే ఉన్నాయి. దీంతో జగన్ వాటిని అమలు చేసే దారిలో ముందుకు సాగుతున్నారు. అందులో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తున్నారు ముఖ్యమంత్రి జగన్.

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుండి నిరంతరం తాను ఇచ్చిన హామీలు కోసం కృషి చేస్తున్నారు. ఇక ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయంలో కాంట్రాక్టు ఉద్యోగుల విషయానికి వస్తే అందరూ రాజకీయ పలుకుబడితో చేరినవారే. వారి వారికే ఉద్యోగాలు వచ్చాయి, తాజాగా వారిని మినహాయించి మిగతావారిని కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీలైనంతమందిని రెగ్యులరైజ్ చేస్తామని ఆర్ధికమంత్రి బుగ్గన తెలియచేశారు దీంతో ఈ ఉద్యోగుల్లో ఆనందం కనిపిస్తోంది.

ఇలా కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడం పై ఉద్యోగుల కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. వేలాది మంది ఉద్యోగులకు దీంతో ప్రయోజనం వస్తుంది.. అయితే జనవరి లో లేదా ఫ్రిబ్రవరిలో దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటారు అని తెలుస్తోంది. అయితే పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఆ ఉద్యోగులను రెగ్యులర్ చేయడం అనే విషయం పై నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ఆనందంలో ఉన్నారు.