Flash: డేంజర్ బెల్స్..కేరళలో కరోనా మరణ మృదంగం

Corona death toll in Kerala

0
109

దేశంలో కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. గత రెండు రోజులుగా 20 వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా మళ్లీ పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.06 లక్షల మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా..23,529 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగించే అంశమే. అయితే, ఇదే సమయంలో మరణాలు కాస్త తగ్గడం ఊరటనిస్తోంది.

తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37 కోట్లు దాటగా..ఇప్పటి వరకు 4,48,062 మందిని వైరస్‌ పొట్టనబెట్టుకుంది. కొత్తగా నమోదైన మరణాల్లో సగం ఒక్క కేరళలోనే వెలుగుచూడటం గమనార్హం. నిన్న ఆ రాష్ట్రంలో 12,161 కొత్త కేసులు నమోదవ్వగా..155 మంది కరోనాతో మరణించారు.

ఇప్పటి వరకు 3.30కోట్ల మంది కొవిడ్‌ను జయించగా..రికవరీ రేటు 97.85 శాతానికి పెరిగింది. ఇక, కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య 3 లక్షల దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,77,020 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 0.82 శాతంగా ఉంది.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం మరో 65,34,306 మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 88.34కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారకంగా వెల్లడించింది.