ఈ వైరస్ తో అతి దారుణంగా ప్రపంచం పరిస్దితి మారిపోయింది. ఎవరూ బయటకు రాలేని పరిస్దితికి వచ్చారు, అయితే వైరస్ గురించి ప్రతీ ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఈ లాక్ డౌన్ మే 3తో అయిపోతుందా ఇంకా పొడిగిస్తారా, ఇలా అయితే తమ జీవితాలు ఏమిటి అనే ఆలోచనలో ఉన్నారు.
అయితే ఇప్పుడు కరోనా గురించి ఓ నిపుణులు చేసిన అధ్యయంన తెలియచేస్తోంది, ఈ వైరస్ తీవ్రత ఇప్పుడు కాస్త తగ్గినా లాక్ డౌన్ ఎత్తినా మరో ప్రమాదం పొంచి ఉంటుంది అంటున్నారు, ఇంకా గుర్తించని కేసుల వల్ల చాలా ఇబ్బంది ఉంటుందంటున్నారు. ఇక వచ్చే రెండు నెలల తర్వాత వర్షాలు పడే సమయం. అప్పుడు కచ్చితంగా ఇంకా ఇబ్బంది ఉంటుంది.
అందుకే ఈ సమయంలోనే ఈ వైరస్ ని తగ్గించాలని అంటున్నారు, అంతేకాదు సామాజిక దూరం మాత్రం కచ్చితంగా పాటిస్తారు అంటున్నారు.. మరో సంవత్సరం పైనే సామాజిక దూరం పాటిస్తారు అని అంటున్నారు ఇతర దేశాలకు ఇప్పుడు కరోనా తగ్గిన తర్వాత వెళ్లినా ..ఈ సామాజిక దూరం పాటిస్తారని కచ్చితంగా 2022 వరకూ ఇది పాటించే అవకాశం ఉంటుంది అని పలువురు నిపుణులు చెబుతున్నారు.