ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేసేందుకు నడుం బిగించారు… ఈ మహమ్మారిని అరికట్టేందుకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే…ఈ నెల 31 వరకు కర్ఫ్యూ విధించారు… పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే వాహనాలను అటునుంచి అటే తిరిగి పంపించేస్తున్నారు…
అత్యవసర సేవలు మినహా ఎవ్వరు బయటకు రాకూడని నిత్యవసర వస్తువుల కోసం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు… జనాలు గుంపులు గుంపులుగా ఉండొద్దని సూచిస్తున్నారు… పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు…
విజయవాడలో ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం రోడ్డు మీదకు వచ్చారు… 31 వరకు లాక్ డౌన్ అని ప్రకటించడంతో జనాలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు… దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.. అన్ని కిరాణా షాపుల ముందు ముగ్గులతో సర్కిల్ గీశారు… ఆ సర్కిల్ పద్దతి ప్రకారం వస్తులను కొనుగోలు చేసుకున్నారు…