కరోనా పై ఏపీ తొలి విజయం….

కరోనా పై ఏపీ తొలి విజయం....

0
76

కరోనా వైరస్ తో పోరాడి ఏపీ తొలి విజయం సాధించింది… విశాఖపట్నం జిల్లాకు చెందిన తిరుపతిరావు అనే వృద్దుడికి కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రికి తరలించారు… ఆయన రక్త నమూనాలను సేకరించి పరీక్షలు చేశారు… ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్ ద్వారా వైద్యం అందిస్తున్నారు…

ఈ క్రమంలో ఆయనకు మూడు సార్లు రక్త నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపారు.. మొదటిసారి పాజిటివ్ వచ్చిన తర్వాత రెండు సార్లునెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశారు… కాగా ఆయన మక్కాకు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా సోకినట్లు నిర్థారించారు దీంతో జిల్లా వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు…

అధికారులు రంగంలోకి దిగి తిరుపతిరావు సన్నిహితులు అతని భార్యను ఇతర కుటుంబికుల వివరాలసు సేకరించి వారందరిని క్వారంటైన్ కు తరలించారు.. వారందికీ పరీక్షలు చేశారు… అందులో అందరికి నెగిటివ్ రాగా ఆయన భార్యకు పాజిటివ్ వచ్చింది… ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో కోలుకుంటుంది…