కరోనా పై చైనా మరో గుడ్ న్యూస్ ప్రపంచ దేశాలు ఫోకస్

కరోనా పై చైనా మరో గుడ్ న్యూస్ ప్రపంచ దేశాలు ఫోకస్

0
50

ఈ వైరస్ పుట్టింది చైనాలో అక్కడ నుంచి అన్నీ దేశాలకు పాకేసింది, అయితే ఈ వైరస్ ఇంత దారుణంగా విజృంభించడంతో ఇప్పుడు అందరూ దీని వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆలోచనలో ఉన్నారు,
ఈ సమయంలో వ్యాక్సిన్స్ కి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

తాజాగా చైనా ఇప్పుడు వ్యాక్సిన్ తయారీలోనూ ముందడుగు వేసింది. ఓ గుడ్ న్యూస్ వచ్చింది, చైనా ఏకంగా మనుషులపై ట్రయల్స్ వేసి దిగ్విజయంగా పూర్తి చేసింది. మనుషులపై వ్యాక్సిన్ బాగా పనిచేసిందని తెలిపి ఊరటనిచ్చింది. దీని గురించి ఓ మెడికల్ జర్నల్ వార్త వెల్లడించింది.

ఇప్పటికే తొలిదశలో 108 మందిపై ట్రయల్స్ చేశారు, ఇవి విజయవంతం అయ్యాయని తెలుస్తోంది.
వైరస్ పై ఎలా పోరాడాలో వ్యాధినిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుందని ఆ వార్త తెలిపింది, ఇక మరోసారి 508 మంది పై ట్రయల్స్ చేయనున్నారు, ఇక ఈ వ్యాక్సిన్ 28 రోజుల వరకూ మనిషికి ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు అని తెలిపారు.