క‌రోనా స‌మ‌యంలో ఈ పెద్ద మ‌నిషి చేసిన సాయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

క‌రోనా స‌మ‌యంలో ఈ పెద్ద మ‌నిషి చేసిన సాయం తెలిస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

0
93

ఈ వైర‌స్ తో చాలా మంది పేద‌లు ఇబ్బంది ప‌డుతున్నారు, మ‌రీ ముఖ్యంగా కూలి ప‌ని చేసుకునే వారు వారికి ప‌నిలేక ఉపాది లేక చేతిలో చిల్లిగ‌వ్వ‌లేక ఇబ్బందులు ప‌డుతున్నారు, ఈ స‌మ‌యంలో వారికి కేంద్రం స‌హ‌యం చేస్తోంది, అయితే ఓ వ్య‌క్తి ఇలా త‌మ గ్రామంలో ఓ ప‌వ‌ర్ ప్రాజెక్ట్ ప‌నికోసం వ‌చ్చిన వారు సొంత ఊరు వెళ్ల‌డానికి ఇబ్బంది ప‌డ‌టం చూశాడు.

దీంతో వెంట‌నే అక్క‌డ నాయ‌కుల‌తో మాట్లాడి సుమారు 60 మందికి అక్క‌డ ఉన్న మూడు స్కూల్స్ లో షెల్ట‌ర్ ఏర్పాటు చేశాడు, వెంట‌నే జిల్లా అధికారుల‌కి చెప్ప‌డంతో వారికి ఫుడ్ అందిస్తున్నారు, ఇక ఉదయం సాయంత్రం టీ టిఫిన్స్ అక్క‌డ ఉన్న గ్రామ‌స్తులు వారికి అందిస్తున్నారు.

రాత్రి ఉద‌యం భోజ‌నం ప్ర‌భుత్వ అధికారులు వ్యానులో తీసుకువ‌చ్చి వారికి అందిస్తున్నారు.. గ్రామం నుంచి దాదాపు 30 కిలోమీట‌ర్ల దూరంలో వారు ప‌వ‌ర్ ప్రాజెక్ట్ ప‌ని చేస్తున్నార‌ట‌. ఆ వ్య‌క్తి చేసిన సాయం వ‌ల్లే తాము ఇలా ఉన్నాము అని వారు సంతోషంలో ఉన్నారు.