కరోనా సమయంలో కంపెనీలకు షాకిస్తున్న సీనియర్ ఉద్యోగులు

కరోనా సమయంలో కంపెనీలకు షాకిస్తున్న సీనియర్ ఉద్యోగులు

0
91

ఈ కరోనా పేరు చెప్పి చాలా వరకూ నగరాలకు గుడ్ బై చెప్పి పల్లె ప్రాంతాలకు చాలా మంది ఉద్యోగులు వెళ్లిపోయారు, ఇళ్లులు ఖాళీ చేసి సొంత ఊర్లకు వెళ్లిపోయారు, అయితే ఎక్కడ ఉన్నా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, అయితే కంపెనీలకు మాత్రం ఇప్పుడు ఇదే పెద్ద సమస్య అయింది.

కొన్ని కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ బాగానే ఉంది. అనుకుక్న దాని కంటే పని ఎక్కువ అవుతోంది, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి చాలా వరకూ రెండు గంటలు ఎక్కువ సేపు పని చేస్తున్నారు ఉద్యోగులు, అయితే ఇప్పుడు కంపెనీలు కొన్ని తెరుచుకున్నాయి, చాలా మంది ఉద్యోగులని కంపెనీలు ఆఫీసుకి రావాలి అంటున్నాయి.

ఈ కరోనా తగ్గే వరకూ వచ్చేది లేదు అని సీనియర్లు చాలా మంది మెయిల్స్ పెడుతున్నారట, సీనియర్లని వదులుకోలేక ఇక వారికి ఒకే చెబుతున్నారు, దాదాపు 78 శాతం మంది ఇంటి నుంచి పని చేస్తాము అని చెబుతున్నారట, ఇక మీడియం పే స్కేల్ ఉన్న ఉద్యోగులు కూడా చాలా వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ కే ఎస్ చెబుతున్నారు. వారు దాదాపు 85 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామంటున్నారట, నొయిడా, హైదరాబాద్ , బెంగళూరులో చాలా కంపెనీల్లో ఉద్యోగులు లేరు, వందకి 20 మంది కూడా ఆఫీసుకి రావడానికి ఇష్టపడటం లేదు అని తాజా సర్వే చెబుతోంది.