క‌రోనా స‌మ‌యంలో ట్రంప్ కు మ‌రో భారీ షాక్

క‌రోనా స‌మ‌యంలో ట్రంప్ కు మ‌రో భారీ షాక్

0
103

అమెరికా ప‌రిస్దితి చూసి, చాలా మంది అగ్ర‌రాజ్యానికి ఎంత క‌ష్టం వ‌చ్చింది అని అంటున్నారు.. పాపం చాలా మంది అక్క‌డ వారి జీవితాలు ఏమ‌వుతాయి అని భ‌య‌ప‌డుతున్నారు, దాదాపు
అమెరికాలో 5,58,000 పాజిటీవ్ కేసులు న‌మోదు అయితే, ఇందులో 22 వేల మంది మృతి చెందారు.

ఇక తాజాగా ఎన్ని ర‌క్ష‌ణ చ‌ర్య‌లు వైద్య చ‌ర్య‌లు తీసుకుంటున్నా,, కేసుల సంఖ్య పెరుగుతోంది రోజుకి వేయి నుంచి రెండు వేల మంది మ‌ర‌ణిస్తున్నారు… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్నేహితుడు స్టాన్లీ చెరా కరోనాతో మృతిచెందారు. ఈ విష‌యం తెలిసి ట్రంప్ షాక్ అయ్యారు.

న్యూయార్క్ సిటీ రియల్ ఎస్టేట్ డెవలపర్‌గా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీకి కూడా స్టాన్లీ భారీ విరాళాలు అందించారు. క్రౌన్ అక్వీసీషన్స్‌ పేరుతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఇక అనేక కంపెనీల‌కు పెద్ద పెద్ద సంస్ద‌ల‌కు ఆయ‌న భ‌వంతులు నిర్మించారు.
డోనాల్డ్ ట్రంప్ ప్రచారం కోసం స్టాన్లీ దాదాపు 4 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చారు. ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషనర్‌తోనూ స్టాన్లీకి అనేక వ్యాపార సంబంధాలు ఉన్నాయి, దీంతో ఆయన మ‌ర‌ణం ట్రంప్ ని క‌లిపివేసింది.