క‌రోనా సోకి న‌ల్ల‌గా మారిపోయారు? షాకైన డాక్ట‌ర్లు రీజ‌న్ ఇదే

క‌రోనా సోకి న‌ల్ల‌గా మారిపోయారు? షాకైన డాక్ట‌ర్లు రీజ‌న్ ఇదే

0
87

ఈ క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అతి దారుణంగా ఇబ్బంది పెడుతోంది, ఇక చైనాలో కూడా మ‌ళ్లీ ఇది ఇప్పుడు విజృంభిస్తోంది. అయితే కొంద‌రికి ల‌క్ష‌ణాలు కూడా క‌నిపించ‌కపోయినా, వారికి టెస్ట్ చేస్తే మాత్రం వైర‌స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది, ఈ స‌మ‌యంలో ల‌క్ష‌ణాలు లేకుండా వైర‌స్ శ‌రీరంలో ఉండ‌టం పై చాలా మంది భ‌య‌ప‌డుతున్నారు.

అయితే కొంద‌రిలోనే ఇలా జ‌రుగుతుంది.. దాదాపు 80 శాత మందికి ఏదో రూపంలో వారికి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. తాజాగా దీనిపై మ‌రో కొత్త విష‌యం వెలుగులోకి వ‌చ్చింది…కరోనా వైరస్ సోకి పరిస్థితి విషమిస్తే మన చర్మం రంగు మారిపోతుందట. ఇలా చైనాకు చెందిన ఇద్దరు డాక్టర్లకు జరిగింది.

ఈ విష‌యం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.కరోనా పుట్టినిల్లు వూహాన్‌కు చెందిన వైద్యులు యీ ఫాన్, హు వెయ్‌ఫెంగ్ ఇద్దరికీ కొవిడ్-19 వ్యాధి వచ్చింది. రెండు నెలలపాటు ఈ వైరస్‌తో పోరాడిన వీళ్లు చివరకు కోలుకున్నారు. కానీ వీరి చర్మం రంగు నల్లగా మారిపోయింది. అయితే దీనికి కార‌ణాలు కూడా చెబుతున్నారు, ఈ ఇద్దరు డాక్ట‌ర్ల‌కు ఈ స‌మ‌యంలో ఇన్ ఫెక్ష‌న్ వ‌ల్ల లివ‌ర్లు పాడ‌య్యాయి, దీంతో వీరి శ‌రీరం రంగు మారింది అని చెబుతున్నారు వైద్యులు.