క‌రోనా టెస్ట్ ఖ‌రీదు ఎంతో తెలుసా? దీని రేటు తెలిస్తే మ‌తిపోతుంది

క‌రోనా టెస్ట్ ఖ‌రీదు ఎంతో తెలుసా? దీని రేటు తెలిస్తే మ‌తిపోతుంది

0
116

ద‌గ్గు జ‌లుబు ఉంటే వెంట‌నే భ‌య‌ప‌డుతున్నారు… మ‌న‌కు క‌రోనా సోకిందా అని.. అయితే దీని ల‌క్ష‌ణాలు దాదాపు 10 రోజుల త‌ర్వాత క‌నిపిస్తాయి, 14 రోజుల‌కి బాడీపై ఎఫెక్ట్ చూపిస్తాయి, అందుకే వీటి విష‌యంలో జాగ్ర‌త్త తీసుకోవాలి, ముఖ్యంగా క‌రోనా వైర‌స్ రాకుండా ఉండాలి అంటే మ‌న జాగ్ర‌త్త‌లు మ‌నం తీసుకోవాలి,

అయితే ఈ వైర‌స్ సోకింది అనే అనుమానం చాలా మందికి వ‌చ్చి ఆస్ప‌త్రిలో చికిత్స‌కు వెళ్లి అడుగుతున్నారు.. కాని వారికి ఏమైనా ల‌క్ష‌ణాలు ఉన్నాయా, లేదా వారు ఇత‌ర దేశాలు వెళ్లారా అనేది చూసి ప‌రీక్ష‌లు చేస్తున్నారు వైద్యులు.

ఈ వైర‌స్ సోకిందా లేదా అనేది నిర్ధారించేందుకు నిర్వహించే ఒక్కో పరీక్షకు 4500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుందట. దేశవ్యాప్తంగా డయోగ్నోస్టిక్స్ ల్యాబ్ ల నెట్ వర్క్ ను నిర్వహిస్తోన్న ట్రివిట్రాన్ న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్ చైర్మన్ జీఎస్ కే వేలు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఇది చాలా ఖ‌రీదైన టెస్ట్ అనే అంటున్నారు.

కాని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో మాత్ర‌మే వీటిని చేస్తున్నారు..భారత్ ల్యాబ్లు జర్మనీ అమెరికా దేశాల నుంచి ఈ
సైన్స్ పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నాయని అన్నారు.