గుడ్ న్యూస్ — భారత్ లో జనవరికి కరోనా వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇస్తారంటే

గుడ్ న్యూస్ -- భారత్ లో జనవరికి కరోనా వ్యాక్సిన్ ముందు ఎవరికి ఇస్తారంటే

0
40

కరోనా నుంచి ప్రపంచం ఎప్పుడు బయటపడుతుందా అని అందరూ వేచిచూస్తున్నారు.. ఇప్పటికే పది నెలలు అయింది ఈ వైరస్ పుట్టి, ఇక కోట్లాది మందికి సోకింది, అయితే ఈ వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది.

ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మన దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పై కీలక ప్రకటన చేశారు. అన్ని పనులు అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో ఇండియాలో సమర్థమంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని గులేరియా తెలిపారు. సీనియర్ నిపుణులు చెప్పిన మాటతో కాస్త ఉపశమనం వచ్చింది అనే చెప్పాలి.

అయితే ఇది వచ్చిన తర్వాత దీనిని ఎలా పంపిణి చేయాలి అనేది మాత్రం పెద్ద ప్రాసెస్ ..దీనికంటూ ముందే ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం, అయితే ముందుగా ఎవరికి వ్యాక్సిన్ ఇస్తారు అనేది చూస్తే..
ఎక్కువ ముప్పు ఉన్న వారికి మొదటగా వాక్సిన్ పంపిణీ ఉంటుంది, అంతేకాదు వైరస్ బారిన పడిన వృద్దులకి చిన్నపిల్లలకి ముందు ఇస్తారు.

పలు వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి ముందు ఇస్తారు, అలాగే ఫ్రంట్ లైన్ లో ఉండి వైద్యం చేస్తున్న వైద్యులు నర్సులు, పోలీసులు పారిశుధ్య కార్మికులకి ముందు వ్యాక్సిన్ అందిస్తారు..
వైరస్ సోకితే మరణించే అవకాశం ఎక్కువగా ఉన్న వారికి కూడా ముందుగా వ్యాక్సిన్ ఇస్తారు… కచ్చితంగా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు.