కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్

కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్

0
92

మన దేశంలో రిచెస్ట్ పర్సెన్, ప్రపంచ ధనవంతుల్లో టాప్ టెన్ లో ఒకరు, దేశీయ కార్పొరేట్ దిగ్గజంగా పేరు గాంచారు… అంబానీ వారసుడు ముఖేష్ అంబానీ, అయితే ఆయన మన దేశంలో అత్యంత ధనవంతుల్లో ముందు వరుసలో ఉంటారు.

ప్రపంచంలోనే 8వ అతిపెద్ద కుబేరుడు .. 4 లక్షల కోట్లకు అధిపతి కానీ ఇప్పటికీ ఆయన ఓ ఉద్యోగి లాగే జీతం తీసుకుంటారట..చాలా మంది దీనిని నమ్మకపోవచ్చు కాని ఇది నిజం, ఏడాదికి ఆయన 15 కోట్లు. జీతం తీసుకుంటున్నారట, దాదాపు 2008 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న నాటినుండి ఇప్పటి వరకు ఆయన జీతం ఇలాగే తీసుకుంటున్నాడని రిలయెన్స్ గ్రూప్స్ తెలిపింది.

జీతం విషయానికొస్తే అంబానీ రూ. 4.36 కోట్లు వేతనం, అలవెన్సుల కింద, కమీషను రూపంలో రూ. 9.53 కోట్లు, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ.71 లక్షలు అందుకున్నారని రిలయన్స్ గ్రూప్స్ సంస్థ తెలిపింది, ఎంత ధనవంతుడు అయినా ఇలా చేయడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.