కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక అది  ఎంతకాలం రక్షణ ఇస్తుంది?

0
42

కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో తెలిసిందే.. అన్నీ దేశాల్లోని పరిస్దితి ఇలాగే ఉంది, అయితే టీకాలు తీసుకున్న వారు మాత్రం కాస్త సేఫ్ గానే ఉన్నారు, చాలా దేశాలు అందుకే  వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా చేస్తున్నాయి. మొత్తానికి ఈ వైరస్ అంతమయ్యే మందు ఇంకా కనుగొనలేదు కాని కొంచెం ఉపశమనం ఇచ్చే వ్యాక్సిన్ పలు డ్రగ్ సంస్ధలు కనుగొన్నాయి, అదే వ్యాక్సినేషన్ గా అన్నీ దేశాలు ఇస్తున్నాయి.

అయితే మనం ఈ టీకా తీసుకున్న తర్వాత ఇక సేఫేనా? ఎన్నిరోజుల వరకూ మనకు ఇమ్యునిటీ బాగుంటుంది అయితే ఇది జీవిత కాలం రక్షణ ఇస్తుందా అంటే?మొదటి డోస్ వేసుకున్న 2 వారాల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కానీ రెండో డోస్ వేసుకున్న తర్వాత ఇమ్యూనిటీలో మరింత యాక్టీవ్ నెస్  వస్తుంది. అందుకే రెండు డోసులు వేసుకున్న వారికి కరోనా ఎఫెక్టయినా పెద్దగా వారిపై ప్రభావం చూపించదు.

ఇక టీకా తీసుకున్న కొంతకాలానికి బూస్టర్ డోసులు అవసరమవుతాయా అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి.. అయితే దీనిపై ఇంకా అడ్వాన్స్ పరిశోధనలు జరగాల్సి ఉంది. టాప్ కంపెనీలు విడుదల చేసిన టీకాల వల్ల తరచూ ఈ బూస్టర్ డోసులు తీసుకోఅక్కర్లేదు అని కొందరు నిపుణులు చెబుతున్నారు…టీకా తీసుకున్నాక విడుదలయ్యే యాంటీబాడీలు కొంతకాలానికి తగ్గిపోతాయి. ప్రస్తుతం ఫ్లూకు ఇచ్చినట్లుగానే కోవిడ్కూ ఏటా టీకాలు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా వైద్య నిపుణులు అంటున్నారు…దాదాపు ఈ ఏడాది డిసెంబర్ కు ఈ పరిశోధనలు పూర్తి చేస్తారు. ప్రస్తుతం నిపుణులు చెబుతున్న దాని ప్రకారం  ఏటా కాకుండా కొన్నేళ్లకోసారి బూస్టర్లు అవసరమవుతాయని  చెబుతున్నారు.