సైకిల్ తొక్కలేక టీడీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత

సైకిల్ తొక్కలేక టీడీపీకి గుడ్ బై చెప్పిన కీలక నేత

0
86

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్లు సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది…. ఏపీలో టీడీపీ పుంజుకోవాలంటే కనీసం మరో 20 సంవత్సరాలు పడుతుందని భావించి తమ్ముళ్లు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు… ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి జంప్ చేశారు…

అయితే క్రమంలో పార్టీ సీనియర్ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ కూడా టీడీపీకి రాజీనామా చేశారు… తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారు… 2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో తనకు ప్రత్తిపాడు సీటు కేటాయించారని ఆరోపించారు..

అక్కడ టీడీపీ ఓటమి చెందుతుందని తెలిసి కూడా పోటీ చేశానని తెలిపారు… కాగా కొద్దికాలంగా మణిక్య టీడీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే… ఈ అసంతృప్తితోనే మండలి సమావేశాలకు హాజరుకాలేదు…