వజ్రాలతో మాస్క్ వావ్ అదిరింది దీని ధర ఎంతో తెలుసా

వజ్రాలతో మాస్క్ వావ్ అదిరింది దీని ధర ఎంతో తెలుసా

0
105

ఈ కరోనా సమయంలో కూడా వ్యాపారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు, అనేక కొత్త ప్రొడెక్టులు తీసుకువస్తున్నారు, శానిటైజర్లు మాస్కులు గ్లౌజులు ఇలా అనేక రకాల కొత్త ప్రొడక్టులు వస్తున్నాయి, ఇటీవల బంగారం వెండి మాస్క్ లు కూడా చూశాం, పెళ్లి పత్రికలు కూడా ఇలాగే తయారు చేసిన వారు ఉన్నారు.

తాజాగా వీటిని తలదన్నే కొత్త ప్రొడక్ట్ తీసుకువచ్చారు వ్యాపారులు.. గుజరాత్ రాష్ట్రం సూరత్ లో పెళ్లి కొడుకు కోరిక మేరకు ఓ కొత్త మాస్క్ తయారు చేశారు.. 24 క్యారెట్ గోల్డ్, అమెరికన్ డైమండ్స్ ఉపయోగించి మాస్కులు తయారు చేస్తున్నారు, ఇటీవల ఓ పెళ్లి కొడుక్కి ఇలాంటి మాస్క్ తయారు చేశారు.

దీంతో మంచి డిమాండ్ వచ్చింది, వీటిని కావాలి అని జనం కోరుతున్నారట.. లక్ష రూపాయల నుంచి మొదలు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెడితే వజ్రాల మాస్కులు తయారు చేసి ఇస్తామని చెబుతున్నారు. తన పెళ్లికి జీవితాంతం గుర్తు ఉండిపోయే విధంగా ఓ పెళ్లి కొడుకు ఇలా 4 లక్షలు పెట్టి వజ్రాల మాస్క్ తయారు చేయించుకున్నాడు.