ఏపీ అధికార వైసీపీ ప్రతిపక్షటీడీపీ నాయకుల మధ్య మాట యుద్దం హీటెక్కుతోంది… అమరావతి పేరుతో టీడీపీ హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డరాని వైసీపీ నాయకులు విమర్శిస్తుంటే అమరావతిని మార్చేందుకు వైసీపీ నాయకులు కుట్రలు పడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు… ఇలా ఒకరిపై ఒకరు మాటల యుద్దం కొద్ది కాలంగా చేసుకుంటున్నారు..
ఈ నేథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మరోసారి ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు… గతంలో పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతిలో పాదయాత్ర చేయగలరా అని సవాల్ విసిరారు…
అమరావతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాల్లో ఒక్కగ్రామంలోఅయిన ఆయన కానీ ఆయన కుటుంబం కానీ పాదయాత్ర చేయగలదా అని ఉమా ప్రశ్నించారు… కనీసం ఇక్కడ రైతుల గురించి మాట్లడగలరా అని ప్రశ్నించారు…