రైల్వే ప్రయాణికులకి గుడ్ న్యూస్ – దసరా స్పెషల్ ట్రైన్లు

రైల్వే ప్రయాణికులకి గుడ్ న్యూస్ – దసరా స్పెషల్ ట్రైన్లు

0
125

ఇక దసరా సీజన్ స్టార్ట్ అవ్వబోతోంది, అయితే సాధారణంగా ఉంటే ఈ దసరాకి పది రోజులు పిల్లలకు సెలవులు వచ్చేవి.. కాని ఈ కరోనా సమయంలో ఆరునెలలుగా స్కూళ్లు లేవు.. దీంతో దసరా సెలవులు ఈసారి ఉంటాయా లేదా రద్దు చేస్తారా అనేది తెలియదు, దసరా అంటే రైలు ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.

మరి ఇప్పుడు దసరా సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లాలి అనుకునేవారు చాలా మంది ఉంటారు.. పండుగలు జాతరలు జరుగుతాయి కాబట్టి దసరాకి ప్రత్యేక రైళ్లు దేశ వ్యాప్తంగా నడుస్తాయి, తాజాగా
రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త అందించింది.

మరిన్ని ట్రైన్స్ అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అవుతోంది. అక్టోబర్-నవంబర్ పండుగ సీజన్ కోసం ఇండియన్ రైల్వేస్ మరిన్ని స్పెషల్ ట్రైన్స్ను నడిపేందుకు సిద్ధమౌతోందట.. అయితే వచ్చే నెలలో మరికొన్ని కొత్త సర్వీసులు స్టార్ట్ చేయనున్నారు, ఇక స్టాప్స్ కూడా పెంచే అవకాశం ఉంది అని తెలుస్తోంది..తాజాగా మరో 80 కొత్త స్పెషల్ ట్రైన్స్ను వచ్చే నెల నుంచి పట్టాలెక్కించడానికి రైల్వేశాఖ రెడీ అవుతుంది అని సమాచారం, అయితే ఇందులో తెలుగుస్టేట్స్ లో కూడా రైళ్లునడవనున్నాయట.