డిసెంబరులో జగన్ మరో ముందు అడుగు

డిసెంబరులో జగన్ మరో ముందు అడుగు

0
79

నెలకో సంచలన నిర్ణయం పథకం తీసుకువస్తూ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ..అయితే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు బాగా మరిగి పనులు కూడా చేయడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి.. నిత్యం ఏసీబీకి కొందరు అధికారులు దొరుకుతున్నారు.. తాజాగా వీటిని అరికట్టేందుకు డిసెంబరులో ఓ ప్రణాళిక బద్దమైన వర్క్ చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి… సీఎం జగన్ కొందరు ఏసీబీ అధికారులని నియమించుకుంటారు అని తెలుస్తోంది.

అంతేకాకుండా అక్రమార్జన చేసి ఉద్యోగులు సంపాదించిన ఆస్తులు, ఎవరైనా అలాంటి ఉద్యోగులు ఉంటే వారి ఇళ్లపై సోదాలకు వెళ్లే ఆస్కారం ఉంటుంది అని తెలుస్తోంది.. వాటిని సర్కారు స్వాదీనం చేసుకునే అవకాశం ఉంది అంటున్నారు. అయితే కొందరు నెలకి 30 వేల జీతం వస్తూఉన్నా, 5 లక్షల లంచాలు పోగేసి కోట్ల రూపాయల విలాసవంతమైన భవంతుల్లో ఉంటున్నారు.. అలాంటి వారి ఆటకట్టించేందుకు జగన్ కూడా ఏమైనా నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు నెటిజన్లు.. వైసీపీ ప్రభుత్వం త్వరలో అవినీతి అధికారుల ఆటలు కట్టించనుందని తెలుస్తోంది.