మన దేశంలో నిరుద్యోగిత పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి.. చాలా మందికి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు ఉన్నా సరైన స్కిల్స్ లేక జాబ్స్ రాని పరిస్దితి ఉంది, ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం చదువులు లేక, అలాగే తెలుగు మీడియంలో చదవడం వల్ల ఈ సమస్యలు మరిన్ని వస్తున్నాయి. అందుకే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
ఉచితంగా విద్య కల్పించడమే కాదు వారికి చదువు అయిన తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ కండెక్ట్ చేస్తున్నాయి. మరి మన ఏపీలో కూడా తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఏపీలో డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. చదువు పూర్తికాగానే డిగ్రీ చదివే వారికి ఉద్యోగాలు లభించేలా సమగ్ర శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడంతో పాటు.. చదువు పూర్తవగానే వారికి ఉద్యోగాలు లభించేలా చేయడం లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రణాళిక రూపొందించింది.
రాష్ట్రవ్యాప్తంగా 525 డిగ్రీ కళాశాలల్లోని విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. డిసెంబరు 15 నుంచే ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. అంతేకాదు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్దులకు ఈ అవకాశం కల్పిస్తారు ఐదు కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నారు.ఈ సమయంలో విద్యార్దులకు అవసరమైన మెటిరియల్
కూడా ఇవ్వనున్నారట.
ప్రభుత్వ కాలేజీలలో ముందుగా వీటిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అలాగే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కు కచ్చితంగా రెండు మూడు నెలల్లో వారికి స్కిల్ డవలప్ మెంట్ జరుగుతుంది అంటున్నారు లెక్చరర్స్… అంతేకాకుండా వారికి ఎక్కడ ఇంటర్వ్యూలకు వెళ్లినా కాంపిటీషన్లో ఎదురుకొని ముందుకు వస్తారు అంటున్నారు సో డిగ్రీ విధ్యార్దులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.