దేశంలో ప్ర‌జ‌ల‌కు ఆధార్ త‌ర‌హాలో హెల్త్ కార్డ్ – ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న ఆ వివ‌రాలు ఇవే ?

దేశంలో ప్ర‌జ‌ల‌కు ఆధార్ త‌ర‌హాలో హెల్త్ కార్డ్ - ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న ఆ వివ‌రాలు ఇవే ?

0
85

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు మ‌న దేశంలో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి, ఇక ఎర్ర‌కోట వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు, దేశంలో ఒక దేశం ఒక ఆరోగ్య కార్డు పధకాన్ని ప్రకటించారు.
దేశ 74వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో ప్ర‌ధాని ఈ ప‌థ‌కం గురించి ఏమ‌న్నారో చూద్దాం.

దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్రపరిచేందుకు ఈ పధకాన్ని చేపడుతున్నారు. ఇక ఓ వ్య‌క్తికి సంబంధించి అత‌ని ఆరోగ్య డీటెయిల్స్ అన్నీ ఈ కార్డులో ఉంటాయి, దీనిని డిజిట‌ల్ రూపంలో భ‌ద్ర‌ప‌రుస్తారు.

అన్నీ ఆస్ప‌త్రుల‌కి ఈ స‌ర్వ‌ర్ కేంద్రంతో అనుసందానిస్తారు, ఇక ఈ ప‌థ‌కం వాడుకోవాలి- లేదు అనేది పౌరుల‌కి ఆస్ప‌త్రుల‌కి ఇష్టం అని తెలిపారు..ఇక ఈ కార్డును కోరుకున్న వారికి ఓ యూనిక్‌ ఐడీ ఇస్తారు. ఈ ఐడీ ద్వారా వారు సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వ‌చ్చు, మొత్తం ఈ ప‌థ‌కానికి మూడు వంద‌ల కోట్లు కేటాయిస్తారు.
ఇక ఆస్ప‌త్రికి వెళ్లిన స‌మ‌యంలో రోగి డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి,, ఎలాంటి రిపోర్టులు క్యారీ చేయ‌న‌వ‌స‌రం లేదు..ఆధార్‌ కార్డు తరహాలో హెల్త్‌ కార్డును జారి చేస్తారు.