దేశం అంతా ఈ విష‌యంలో ఏపీని చూస్తోంది?

దేశం అంతా ఈ విష‌యంలో ఏపీని చూస్తోంది?

0
83

అవును మ‌న దేశంలో అంద‌రూ కోవిడ్ గురించి భ‌య‌ప‌డుతున్నారు, ఈ స‌మ‌యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ విధించిన లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, అన్నీ రాష్ట్రాలు, అక్క‌డ ప్ర‌తిప‌క్షాలు కూడా దీనికి స‌హ‌క‌రిస్తున్నాయి, కాని ఏపీలో మాత్రం ప్ర‌తిప‌క్షం అధికార ప‌క్షం రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి.

ఏపీలో ఓ ప‌క్క కేసులు పెరుగుతున్న‌ వేళ ఈ విధంగా రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం పై అంద‌రూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.. అన్నీ రాష్ట్రాలు కూడా ఇది అబ్జ‌ర్వ్ చేస్తున్నాయి, ఇదేం ప్రతిప‌క్షం అని ప్ర‌శ్నిస్తున్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ప్ర‌భుత్వానికి సాయం చేస్తున్న ప్ర‌తిప‌క్షాలు ఉన్నాయి, లేక‌పోతే సైలెంట్ గా ఉన్న వారు ఉన్నారు …కాని ఏపీలో మాత్రం ప్ర‌తిప‌క్షం ప్ర‌తీదీ రాద్దాంతం చేస్తోంది అని సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి, ఈ క‌రోనా తీవ్ర‌త త‌గ్గేవ‌ర‌కూ అయినా రాజ‌కీయాలు కాకుండా దీనిపై అంద‌రూ క‌లిసి పోరాడాలి అని యువ‌త కోరుతున్నారు.