వరుసగా గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ఢిల్లీలో ఎన్నికలు పూర్తి అయిన తర్వాత వెంటనే గ్యాస్ ధరలు పెంచేశారు.సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ల ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది… ఢిల్లీలో రూ.144.50 మేర పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది, దీంతో సబ్సిడీ లేని వారికి షాక్ తగిలింది.
14.2 కిలోల సబ్సిడీయేతర గ్యాస్ సిలిండర్ ధర 858.5కు పెరిగింది. ఏపీలో అన్ని పన్నులతో కలిపి రూ.148.50 మేర పెరిగిన సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.741.50 నుంచి ఏకంగా రూ.889.50కి చేరింది.
ఇలా వరుసగా ఆరోసారి ధర పెరిగింది అని చెప్పాలి.
సెప్టెంబరు నుంచి సబ్సిడీయేతర సిలిండర్ల ధర పెరుగుతూ వస్తోంది..ప్రధాని మోదీ పిలుపు మేరకు సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకున్నవారు మాత్రం పెరుగుతున్న ధరలతో బెంబేలెత్తుతున్నారు.. ఒకవేళ ఏడాదికి 12 సిలెండర్లు సరిపోలేని వారు కూడా ఇంతే ధరతో బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తుంది.
ధరలు గత ఆరునెలలుగా ఎలా పెరిగాయంటే
సెప్టెంబరు 16 ధరపెరిగింది.
అక్టోబరు 13.50 ..ధరపెరిగింది.
నవంబరు 56.50 ధరపెరిగింది.
డిసెంబరు 34 ధరపెరిగింది.
జనవరి 21 ధరపెరిగింది.
ఫిబ్రవరి 148.50 ధరపెరిగింది.