ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై అలాగే మంత్రులపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమా సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా పార్టీ కార్యాలయంలో అయన మాట్లాడుతూ… ఏపీలో కొద్దికాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా సమస్యలు తలెత్తుతున్నాయని అయన రోపించారు.
వాటిగురించి పట్టించుకోకుండా రాజధానిని వరదల్లో ముంచాలని చూస్తున్నారని దేవినేని ఉమా అన్నారు… రాష్ట్రం వరదలతో అతలా కుతూహలం అవుతుంటే వైసీపీ నాయకులు మాత్రం కేవలం చంద్రబాబు నాయుడు నివాసం మాత్రమే ముంచాలనే ప్రయత్నాలు చేస్తున్నారని అయన మంది పడ్డారు…
ప్రస్తుతం వైసీపీ నాయకులు అధికార గర్వముతో ఉన్నారని అయనమండిపడ్డారు… వారు చేస్తున్న అక్రమాలన్ని ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో వారికీ తగిన బుద్ది చెబుతారని ఉమా అన్నారు.