ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటా…

ప్రాణం ఉన్నంతవరకు టీడీపీలోనే ఉంటా...

0
106

తన ప్రాణం ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టలో కొనసాగుతానని ఇంచార్జ్ టీడీపీ రాష్ట్ర యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొద్దికాలంగా తాను టీడీపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటానని వార్తల వస్తున్నాయి.

ఈ వార్తలపై ఆయన స్పందిచారు… తాను ఎట్టిపరిస్థిలో పార్టీ మారనని స్పష్టం చేశారు అవినాష్. తాను రాజకీయంగా ఎదుగుతుంటే ఈ ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేక తనపై ప్రచారం చేస్తున్నారని అన్నారు…

తాను ఎట్టి పరిస్థితిలో పార్టీమారనని అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు… తన తండ్రి ఆశయాలు నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు తనకు అవకాశం కల్పించారని ఆయనకు జీవితాంతం రుణపడిఉంటానని అన్నారు…