దేవినేని బాట‌లో వంగ‌వీటి కీలక నిర్ణయం

దేవినేని బాట‌లో వంగ‌వీటి కీలక నిర్ణయం

0
91

దేవినేని వంగ‌వీటి రాజ‌కీయాల్లో ముఖ్యంగా విజయవాడ పాలిటిక్స్ లో ఈ రెండు పేర్లు చెప్పకుండా రాజకీయాలు ఉండవు.. అయితే ఇప్పుడు వారసులు మాతమే రాజకీయాల్లో ఉన్నారు.. దేవినేని కుమారుడు అవినాష్ ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. ఇక తూర్పు సెగ్మెంట్ నుంచి విజయవాడలో వైసీపీ బాధ్యతలు తీసుకుంటారు అనేది పక్కా.

అయితే జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉంటూ పార్టీలో కొంత పేరు సంపాదించుకున్న వంగవీటి రాధా మాత్రం పార్టీ నుంచి దూరం అయిపోయాడు. ఎన్నికల ముందు వేసిన ఓ రాంగ్ స్టెప్ అతనిని పార్టీకి అభిమానులకి దూరం చేసింది. ఇప్పుడు టీడీపీలో ఉన్నాడు.

అయితే దేవినేని బాటలో వంగవీటి కూడా తన పాత గూటికి చేరుతారా, వివాదాలు సమస్యలు లేకుండా ముందుకు కలిసి సాగుతారా అనే చర్చ విజయవాడలో సాగుతోందట. అంతేకాదు జగన్ కోరితే వంగవీటి రాధా మళ్లీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరిచూడాలి ఇద్దరూ కలిసి రాజకీయంగా ఒకే పార్టీలోకి వెళితే మాత్రంపెద్ద చర్చే … అయితే గొడవలు కోట్లాటలు గతంలో అలా ముగిసాయి, ఇక వారసులు వాటిని కొనసాగించవద్దు అని విజయవాడ ప్రజలు కోరుకుంటున్నారట.