శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు రాజకీయంగా మంచి అనుభవం ఉంది… కరెక్ట్ టైమ్ లో పార్టీ వేదికల సాక్షిగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడుతుంటారు ఆయన… పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే శ్రీకాకుళం నుంచి మూడు కీలక సెగ్మెంట్ లు పోతాయని అంతేకాదు అభివృద్ది మూడు దశాబ్దాలు వెనక్కి పోతుందని కూడా ఏకంగా పార్టీ వేదికగా చేసుకుని చెప్పారు ధర్మాన…
ఇలా అయితే వైసీపీకి పొలిటికల్ గా కూడా ఇబ్బందులు వస్తాయని చెప్పారు… ధర్మాన ఇలా గట్టిగా చెప్పడం వల్లే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త జిల్లాల విషయంలో కమిటీ ఏర్పాటు చేశారని అంటున్నారు…
అంతేకాదు ఎక్కడ సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటామంటున్నారు… ఈ క్రమంలో ఎచ్చెర్లను శ్రీకాకుళంలో ఉంచాలని జగన్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారట… దీంతో మాజీ ధర్మాన ప్రసాదరావుకు జగన్ దగ్గర వెయిట్ బాగా పెరిగింది అని అంటున్నారు..