ఈ ఏడాది వినాయక చవితి పూజ ఈ సమయంలో చేసుకుంటే ఎంతో పుణ్యం

ఈ ఏడాది వినాయక చవితి పూజ ఈ సమయంలో చేసుకుంటే ఎంతో పుణ్యం

0
34

వినాయక చవితి వస్తోంది అంటే సందడే సందడి, పిల్లలు పెద్దలు అందరూ కూడా బొజ్జ గణపయ్యని మనసారా పూజిస్తారు, ఇక వీధుల్లో మండపాల ఏర్పాటు చేసి గణపయ్య విగ్రహాలు ఏర్పాటు చేసి, ఆ వినాయకుడ్ని పూజిస్తారు, ఈ కరోనా సమయంలో ఇక వీధి మండపాలు విగ్రహాలు ఈఏడాది పెట్టడానికి లేదు.

అయితే ఇప్పుడు పూజ ఏ సమయంలో చేసకోవాలి వినాయక కథ ఏ సమయంలో చదువుకోవాలి అని పండితులు చెబుతున్నారు, మరి ఆ విషయాలు చూద్దాం.

ఈ సంవత్సరం గణేశ చతుర్తి ఆగస్ట్ 22న శనివారం వస్తోంది. ఆ రోజు రాత్రి 7.57 వరకూ గణేశ చతుర్థి ఉంటుంది. 7.10 నుంచి హస్తా నక్షత్రం దర్శనమిస్తుంది. ఈ సమయం వరకూ పూజ చేసుకోవచ్చు.
మధ్యాహ్నం 12.22 నుంచి సాయంత్రం 4.48 వరకూ అమృత గడియలు ఉన్నాయి. చిన్న విగ్రహాలు ఇంట్లో వ్యాపారస్తులు పెట్టుకునే వారు ఈ సమయంలో పెట్టుకుంటే లాభాలు వస్తాయి, మంచి సమయం అని చెబుతున్నారు పండితులు.