సముద్రంలో ట్రాఫిక్ జామ్ అంటూ నాలుగు రోజులుగా వార్తలు వింటున్నాం… అయితే మరి ఈ భారీ నౌక ఎలా ఆగిపోయింది, అసలు ఈ సూయిజ్ కెనాల్ ఏమిటి అనేది చూద్దాం…మధ్యధరా, హిందూ మహాసముద్రాలను కలుపుతూ ఈజిప్టులో కృత్రిమంగా నిర్మించారు ఈ కెనాల్… దీనిని 1869 లో స్టార్ట్ చేశారు, దీని పొడవు 193 కిలోమీటర్లు. వెడల్పు సుమారు 200 మీటర్లు. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 10-12% ఈ కాలువ మీదుగా భారీ నౌకల ద్వారా రవాణా సాగుతుంది, రోజుకు భారీ చిన్న నౌకలు దాదాపు 60 వరకూ ఈ దారిలో వెళతాయి.
ఈనెల 23న సూయిజ్ కాలువ దక్షిణ ద్వారం నుంచి 3.7 మైళ్లు ప్రయాణించిన తర్వాత ఇసుక తుపాను, తీవ్ర గాలుల ధాటికి
ఎవర్ గివెన్ దారి నుంచి అడ్డం తిరిగింది..నౌక ముందు భాగం కాలువ అంచున ఉన్న ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయింది.
ఇక గాలులు తగ్గినా నౌక అలాగే ఉండిపోయింది.
జపాన్లోని షోయి కిసెన్ కైసా సంస్థకు చెందిన భారీ సరకు రవాణా నౌక ఇది….ఎవర్ గివెన్ అనే పేరు పెట్టారు దీనికి, దీనిని
తైవాన్కు చెందిన ఎవర్ గ్రీన్ సంస్థ నిర్వహిస్తోంది. దీని బరువు: 2,19,076 టన్నులు ఉంటుంది.. మరి ఈ నౌకని తీయాలి అంటే పరిష్కారం ఏమిటి అంటే..నౌక ముందు భాగాన్ని మరో నౌకతో పక్కకు లాగడం….లేదా ఎక్కడ ఓడ చిక్కుకుందో అక్కడ
ఇసుకను తొలగించి తీయడం. అందులో కంటైనర్లు తీసి తేలిక అయిన తర్వాత నౌక తీయడం. ఇలా దానిని సాధారణ స్ధితికి తీసుకురావచ్చు.
ReplyForward
|