మున్సిపల్ బడ్జెట్ పై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు

0
87

తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23) బడ్జెట్ రూపకల్పనకు అడుగులు పడుతున్నాయి. దీనికి ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే విధంగా సన్నాహాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను, అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడిస్)లను ఆదేశించింది.

తెలంగాణ మున్సిపల్ చట్టం 2019 లోని సెక్షన్ 107 ప్రకారం స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లు) ఆదాయ వ్యయాలు, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసుకుని స్వయం వనరుల సమీకరణ ప్రయత్నాలు చేసుకుంటూ బలోపేతమయ్యాయి. మార్గాలు కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయుడి) పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. క్వాలిటీలలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి లక్ష్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పన ఉండాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలు ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి “పట్టణ ప్రగతి” నిధులు అందుతాయని ఆ లేఖలో పేర్కొన్నారు.

శానిటేషన్, వాటర్ చార్జెస్, లోన్ పేమెంట్స్, కరెంట్ చార్జీలతోపాటు పది (10%) శాతం గ్రీన్ బడ్జెట్ నిధులను ఖర్చు(ఎక్స్ పెండిచర్) గా చూపాలని నిర్దేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) మరో రెండు నెలలు ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ఆర్థిక సంవత్సరం(2022-23) వార్షిక బడ్జెట్ ను సమర్థవంతంగా రూపొందించేందుకు జిల్లా కలెక్టర్లు ఫిలిమినరి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల బడ్జెట్ కౌన్సిల్ సమావేశాలకు కలెక్టర్ మరియు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) విధిగా హాజరు కావాలని సూచించారు.