టీడీపీలో భారీ చీలికలు…. తమ్ముళ్లు తలో దారి

టీడీపీలో భారీ చీలికలు.... తమ్ముళ్లు తలో దారి

0
82

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో త్వరలో చీలికలు రాబోతున్నాయా… తమ్ముళ్లు ఎవరి దారి వారు పట్టబోతున్నారా…. అంటే అవుననే అంటన్నారు… అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి…. తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… టీడీపీలో చీలికలు రాబోతున్నాయనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని అన్నారు..

అందుకే ప్రస్తుతం ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు… ముఖ్యమంత్రి జగన్ ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదని అన్నారు… పోలీసుల మీద ఆధారపడి జీవించేది చంద్రబాబు అని అన్నారు.. జెడ్ ప్లస్ భద్రత లేకుండా ఆయన జనాల్లోకి వెళ్లగలరా అని ప్రశ్నించారు…

కాగా ఇటీవలే చంద్రబాబు నాయుడు జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే పోలీసులు లేకుండా తుళ్లూరులో తిరగాలని సవాల్ విసిరారు… ఇందుకు శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు…