రేపు వైసీపీలోకి కడప కీలక నేత

రేపు వైసీపీలోకి కడప కీలక నేత

0
100

తెలుగుదేశం పార్టీ తొలిజాబితాలో 126 మంది పేర్లు వెల్లడించారు బాబు.. అయితే బాబు అనుకున్న విధంగా సెగ్మెంట్లలో ఇంచార్జులకు అలాగే 80 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చారు.. కాని ఈ సమయంలో కపడ జిల్లాలో కొన్ని కీలక సెగ్మెంట్ల విషయంలో పార్టీలోకి కొందరు నేతలు రావాలి అని ప్రయత్నం చేశారు.. ఈ సమయంలో అప్పటికే పార్టీలో ఉన్ననేతలు వారి రాకను అంగీకరించలేదు. వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదు అన్నారు. అందులో ముఖ్యమైనది మైదుకూరు ఇక్కడ నుంచి మాజీ మంత్రి డీఎల్ తెలుగుదేశంలో చేరుతారు సీటు సంపాదిస్తారు అని అందరూ అనుకున్నారు.

కాని ఇక్కడ పుట్టాసుధాకర్ యాదవ్ ఆయన రాకనే కాదు, తనకు కాకుండా సీటు డీఎల్ కు ఇస్తే సహించేది లేదు అన్నారు.. దీంతో బాబు కూడా ఆయనకు సీటు ఇవ్వను అని చెప్పారు.. ఇక వైసీపీలోకి ఆయనకు ఎప్పుడూ గ్రీన్ సిగ్నల్ ఉంది. తాజాగా తన స్నేహితుడి కుమారుడు కాబట్టి జగన్ దగ్గరకు వెళ్లడం బెటర్ అని డీఎల్ భావిస్తున్నారు. ఇక మైదుకూరు టికెట్ ఇవ్వకపోయినా ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారు అని హామీ గతంలోనే వచ్చిందట.ఇక మరో రెండు రోజుల్లో ఆయన వైసీపీలో చేరడం షురూ అంటున్నారు పార్టీ నేతలు.