ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా అనారోగ్యానికి గురి అయితే కచ్చితంగా వారికి ఆ సమయంలో దేవుడు అంటే వైద్యుడు అని చెప్పాలి.. నిజమే మరి ప్రపంచానికి పెద్ద అన్నగా ఉండే దేశం అమెరికా, మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది, ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు.
మరి అమెరికా అధ్యక్షుడు అంటేనే ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తి, మరి ఆయనకు ఎవరు చికిత్స అందిస్తున్నారు అనే దాని గురించి చర్చించుకుంటున్నారు..సీన్ కాన్లీ అనే వైద్యుడు వైట్ హౌస్ లో ట్రంప్ కు చికిత్స అందిస్తున్నారు..
సీన్ కాన్లీ 2018 నుంచి ట్రంప్ కు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేస్తున్నారు.. ఆయన మిలటరీ అధికారిగా పని చేశారు, అంతేకాదు ఆయన వైద్యుడు, అమెరికా అధ్యక్షులకు మిలటరీ అధికారులే వైద్యులుగా పనిచేస్తూ ఉంటారు. అధ్యక్షుడికి ఏమైనా జరిగితే ఆ సమయంలో వెంటనే మిలటరీ వైద్యులు సత్వరమే స్పందిస్తారు అనే కారణంతో వారిని నియమిస్తారు, వారు ఏదైనా ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు. ఆయన 2002లో యూనివర్సిటీ ఆఫ్ నోట్రడామ్ నుంచి వైద్య పట్టా తీసుకున్నారు.. 2018 మార్చి నుంచి అధ్యక్షుడు ట్రంప్ కి వ్యక్తిగత వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన వైట్ హౌస్ లోనే ట్రంప్ కుటుంబానికి డాక్టర్ గా ఉన్నారు.