తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు మొత్తం 13 మంది దుర్మరణం చెందారు.
భారత్‌లో అత్యంత శక్తిమంతమైన సైనికాధికారి బిపిన్ నే. చైనా, పాకిస్తాన్ దూకుడుకు కళ్లెం వేయడంతో బిపిన్ రావత్‌కు ఎక్స్‌పర్ట్‌గా ఉన్నారు. లడ్డాఖ్ సంక్షోభం సమయంలో ఆయన త్రివిధ దళాలకు వ్యూహకర్తగా పని చేశారు. కానీ బిపిన్ రావత్ తన చివరి కోరిక తీరకుండానే మృతి చెందారు. ఇంతకీ ఆయన కోరిక ఏంటంటే..రిటైరయ్యాక ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామమైన ‘సైనా’లో ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. 2018 చివరిసారిగా ఆయన సొంతూరును సందర్శించారని బిపిన్ మేనమామ భరత్ తెలిపారు.
బిపిన్ ఫోన్లో నాతో మాట్లాడేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సైనీకి వస్తానన్నారు’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు భరత్. పౌరి జిల్లాలోని ద్వారిఖాల్ బ్లాక్‌లో సైనీ గ్రామం ఉంది. వచ్చే ఏడాది సొహాగ్‌పూర్ వచ్చి సైనిక పాఠశాల పనులు ప్రారంభిస్తానని రావత్ చెప్పినట్లు బావమరిది యశవర్ధన్ అన్నారు.