పళ్లతొ కొట్టుకోవడం రంగులతో కొట్టుకోవడం కోడి గుడ్లతో కొట్టుకునే ఫెస్టివల్స్ ని మనం చూసే ఉంటాం, అయితే ఇది ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా …అదే పేడతో కొట్టుకునే పండుగ, నిజమే ఇలాంటి పండుగ జరుగుతుంది. ఇక ఆ కంపు మాములుగా ఉండదు మరి ఇది ఎక్కడ జరుగుతుంది అనేది చూద్దాం.
స్పెయిన్లో ఏటా టమోటా ఉత్సవం – ఇటలీలో ఆరెంజ్ యుద్ధం జరుగుతుంది. ఇలా పండ్లతొ కొట్టుకుంటారు, కాని ఓ చోట పేడ యుద్దం బాగా ఫేమస్ …కర్ణాటక – తమిళనాడు సరిహద్దులో గల గుమ్మటపురాలో ఏటా పేడతో కొట్టుకొనే వేడుక జరుగుతుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఊర్లలో పేడ కనుమరుగు అవుతుంది. ఇక్కడ ఉత్సవానికి ముందు పేడని తీసుకువచ్చి ట్రాక్టర్లతో తరలిస్తారు, ఓ చోట వేసి దీనితో ఉత్సవంగా ఒకరిపై ఒకరు కొట్టుకుంటారు.
ఈ ఉత్సవాన్ని గోరెహబ్బా అంటారు. పేడను పెద్ద పెద్ద ముద్దలుగా చుట్టి కొట్టుకోవడం ఈ పండుగలో ఆనవాయితీ.
ఇక్కడ బీరేశ్వర స్వామి ఆవు పేడలోనే పుట్టారని గ్రామస్తుల నమ్మకం. దీపావళికి ఇక్కడ ఇలా పేడతో కొట్టుకుంటారు, ఇలా చేస్తే ఎలాంటి రోగాలు ఉండవు అని స్వామి కృప కలుగుతుంది అని నమ్ముతారు, ఇక ఇందులో పురుషులు మాత్రమే పాల్గొంటారు షర్టులు లేకుండా వేడుక చేస్తారు.