ఇంట్లో చాలా మంది బూజులు దుమ్ము ఇలాంటివి చాలా వరకూ దులపకుండా ఉంచుతారు.. కొందరు అయితే రెండు మూడు రోజులకి మాత్రమే చీపురుతో తుడుస్తూ ఉంటారు.. ఇంటిని పెద్దగా శుభ్రంగా ఉంచుకోరు.. ఇలాంటివి చేస్తే ఇంట్లో ధనలక్ష్మీ ఉండదు.. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉండదు.. ముఖ్యంగా పెద్దలు అందుకే ఇంట్లో లేవగానే దుమ్ము లేకుండా గదులు అన్నీ శుభ్రంగా ఉంచుకుంటారు.
అయితే ఇలా ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే ఏమవుతుంది అంటే ఇంట్లో రోగాలు వస్తాయి.. అలాగే ఇంటి పెద్దలు మగవారు వ్యాపారం ఉద్యోగం చేస్తే అందులో పెద్ద రాణింపు ఉండదు.. నగదు చేతిలో ఉండదు.. ఇలాంటి అనేక సమస్యలు వస్తాయి, ముఖ్యంగా ఆర్దికంగా వారికి పెద్దగా రాణింపు ఉండదు.
ఇక సాయంత్రం ఆరు తర్వాత రాత్రి వేళ చీపురుతో ఇళ్లు ఊడ్వకూడదు.. ఇలా చేస్తే ఇంట్లో చాలా దరిద్రం అంటారు, అంతేకాదు చాలా సమస్యలు వస్తాయి.. అందుకే ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి ఎలాంటి బూజులు దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎందుకు లక్ష్మీ దేవి ఉండదు అంటే అశుభ్రం అంటే ఆమెకి ఇష్టం ఉండదు అందుకే ఇలాంటి చోట ఆమె నిలవదు.