డొక్కాను డోంట్ కేర్ అనేసిన టీడీపీ

డొక్కాను డోంట్ కేర్ అనేసిన టీడీపీ

0
96

టీడీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీకి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపారు… ఈ లేఖలో ఆయన తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో పేర్కోన్నారు… 2019 ఎన్నికల్లో తాను తాడికొండ నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదని చివరి నిమిషంలో ప్రత్తిపాడు టికెట్ కేటాయించారని ఆరోపించారు…

ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు… మాణిక్య వరప్రసాద్ చెప్పిన మాటలు అపద్దమని అన్నారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డొక్కా కు టీడీపీ అధిష్టానం సముచిత స్థానం కల్పించిందని అన్నారు…

ఓటింగ్ సమయంలో మండలికి హాజరు కాకపోవడంతో వైసీపీలోకి వెళ్లారన్న విషయం అర్థం అయిపోందని అన్నారు వర్ల… కనీసం వైసీపీలో అయినా డొక్కా కొనసాగలని కోరుకుంటామన అన్నారు..